naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Tuesday 11 December 2012

తెల్లదొర

కట్కేస్తే 
బుగ్గెలిగినట్టు 
ఒక్క గోలేస్తే 
రోగంగుదిరేట్టు 
ఎందుకు 
కనుక్కోలెదో 
ఆ తెల్లదొరలు 

ఉన్నోల్లకురావు 
ఈ పాడురోగాలు 
పంజేసుకుటెనే
పట్టెడు మెతుకులు
దొరికేటోనికి
మోకాళ్ళ నొప్పులొస్తే
పనెట్టజేయాలె
గోలెట్టగొనాలె
ఆనికి ఆకలిసావు రదాయింగ

కట్కేస్తే
బుగ్గెలిగినట్టు
ఒక్క గోలేస్తే
రోగంగుదిరేట్టు
ఎందుకు కనుక్కోలెదో
ఆ తెల్లదొరలు

మా ఎదురింటి
సూరమ్మ కని
యాడాద్దిర్గలే
దానికి కడుపుల
పెద్ద పుండువొశె
దాని మొగుడు
అప్పుజేషి తీర్చనీకె
పట్నంబోయిండు
అప్పు సంగతి మర్షి
ఇంకోదానికి మరిగిండు
ఈడ ఈమే
బిడ్డకి బువ్వెట్టవెట్టాలే
అప్పెట్టదీర్వాలె
ఒళ్ళేమో పచ్చి పుండాయే

కట్కేస్తే
బుగ్గెలిగినట్టు
ఒక్క గోలేస్తే
రోగంగుదిరేట్టు
ఎందుకు కనుక్కోలెదో
ఆ తెల్లదొరలు

నా కొడుక్కి
గుండెల పైపులేషిర్రు
సర్కారు దవఖాన్ల
తిర్గి తిర్గి చేపిచ్చిన
అండ్ల దిర్గినందుకు
మంచిగున్నోన్ని
మంచమెక్కిన
ఏదో ఇంపెచ్చనొచ్చిందట
మా కోడలు పిల్ల
కూలికిబోయి
సాదవట్టె మమ్ముల

కట్కేస్తే
బుగ్గెలిగినట్టు
ఒక్క గోలేస్తే
రోగంగుదిరేట్టు
ఎందుకు కనుక్కోలెదో
ఆ తెల్లదొరలు
ఈ పాడురోగాలు
ఉన్నోల్లకన్నరావు

- వర్ణలేఖ 

No comments:

Post a Comment