నాపైన అలిగింది నా మనసు
ఎందుకో తెలీదు
చాలా రోజులనుండి
సరిగ్గా మట్లడడం లేదు
ఎందుకా అని ఆరా తీస్తే
ఉలకదు పలకదు
చాలా కష్టపడి తెల్సుకున్న,
ఆశ్చర్యపోయా
కారణం తెలిసి,
సర్వకాల సర్వావస్తల్లొ
నేను తన మాటే వినాలట.
కారణం తెలిసాక నేను
మూగబోయా....
నన్ను నేను యెక్కువ కాలం
యెమర్చలేకపోయననె బాధను
కల్లల్లొ నుండి జారకుండ జాగ్రతపడుతూ .....
-వర్ణలేఖ
No comments:
Post a Comment