naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Tuesday, 11 December 2012

నిశ్శబ్ధం

హేయ్....
ఆ....
ఎలా ఉన్నావు?
ఊ....
అంటే ఏమిటి?
బాగున్నా
నిజంగా?
.................. (నిశ్శబ్ధం)
మరీ నీ మనసెలా ఉంది?
.................. (నిశ్శబ్ధం)
మళ్ళెప్పుదొస్తావు?
మళ్ళీ నెలకు
ఆ అన్ని రోజులా?
ఊ....
ఎందుకు బాలేవు అసలు?
నెలదాకా రాలేనని

వర్ణలేఖ - 17joon12

ఓ పావురం

ఓ పావురం 
నావైపే వస్తోంది 
నన్నే చూస్తూ 
నాకోసమే 
వెతికి వెతికి 
అలసిపోయినట్టు 
నా పక్కనే ఉన్న 
చెట్టు కొమ్మమీద 
వాలింది నన్నే చూస్తూ
అప్పుడు తెలిసింది 
అది నీవు పంపిన
విహంగమని
నాకోసం నీ మనసుని
మోసుకొచ్చిందని
ఎంతసేపో ఎదురుచూసా
ఏ సందేశం
పంపావోనని
గంటసేపైనా నోరు
మెదపదు
సందేశం ఇవ్వడంలేదు
సందేహం తప్ప
చివరకి తెలుసుకున్నా
అది నీ మౌనాన్నే
మోసుకొచ్చిందని

వర్ణలేఖ - 19జూన్12

నీ జ్ఞాపకాల్లో

నీ జ్ఞాపకాల్లో 
మనసు చితికినప్పుడల్లా 
బాధను స్రవించి 
కళ్ళను కన్నీటితో 
నింపుతుంది....

ఆ కన్నీరే 
ఏ కాగితాన్ని 
కవితలతో 
అలుకుతూనే ఉంది....

ఎన్ని ముగ్గులేసినా
ఎన్ని మొగ్గలేసినా
తీరని వేదన.....

అప్పుడెప్పుడో
కలలో కంపించిన
జ్ఞాపకం నీవు,
ఒక నవ్వేసుకుని.....

ఇప్పుడు ఇలా
నన్ను పెనవేసుకున్నావు
చిత్రంగా మళ్ళీ
ఊహల్లోనే....

- వర్ణలేఖ 

తెల్లదొర

కట్కేస్తే 
బుగ్గెలిగినట్టు 
ఒక్క గోలేస్తే 
రోగంగుదిరేట్టు 
ఎందుకు 
కనుక్కోలెదో 
ఆ తెల్లదొరలు 

ఉన్నోల్లకురావు 
ఈ పాడురోగాలు 
పంజేసుకుటెనే
పట్టెడు మెతుకులు
దొరికేటోనికి
మోకాళ్ళ నొప్పులొస్తే
పనెట్టజేయాలె
గోలెట్టగొనాలె
ఆనికి ఆకలిసావు రదాయింగ

కట్కేస్తే
బుగ్గెలిగినట్టు
ఒక్క గోలేస్తే
రోగంగుదిరేట్టు
ఎందుకు కనుక్కోలెదో
ఆ తెల్లదొరలు

మా ఎదురింటి
సూరమ్మ కని
యాడాద్దిర్గలే
దానికి కడుపుల
పెద్ద పుండువొశె
దాని మొగుడు
అప్పుజేషి తీర్చనీకె
పట్నంబోయిండు
అప్పు సంగతి మర్షి
ఇంకోదానికి మరిగిండు
ఈడ ఈమే
బిడ్డకి బువ్వెట్టవెట్టాలే
అప్పెట్టదీర్వాలె
ఒళ్ళేమో పచ్చి పుండాయే

కట్కేస్తే
బుగ్గెలిగినట్టు
ఒక్క గోలేస్తే
రోగంగుదిరేట్టు
ఎందుకు కనుక్కోలెదో
ఆ తెల్లదొరలు

నా కొడుక్కి
గుండెల పైపులేషిర్రు
సర్కారు దవఖాన్ల
తిర్గి తిర్గి చేపిచ్చిన
అండ్ల దిర్గినందుకు
మంచిగున్నోన్ని
మంచమెక్కిన
ఏదో ఇంపెచ్చనొచ్చిందట
మా కోడలు పిల్ల
కూలికిబోయి
సాదవట్టె మమ్ముల

కట్కేస్తే
బుగ్గెలిగినట్టు
ఒక్క గోలేస్తే
రోగంగుదిరేట్టు
ఎందుకు కనుక్కోలెదో
ఆ తెల్లదొరలు
ఈ పాడురోగాలు
ఉన్నోల్లకన్నరావు

- వర్ణలేఖ 

Thursday, 7 June 2012

నీ చల్లని వెన్నెల నను
చేరకుండా నీలిమేఘాలు
గుమిగూడాయి
చినుకుల్లో కలుపరాదు
నీ ప్రేమను
నే ఆరుబయటే
దోసిలితో సిద్దంగా వున్నా
నీ వలపు జల్లుని
ఒడిసిపట్టడానికి

వర్ణలేఖ - 5jun12

Mini Poem -

నీ ఊహతో వచ్చిన రెక్కలు
నిను చూస్తూనే మాయమవుతున్నాయి

వర్ణలేఖ - 8jun12

Tuesday, 5 June 2012

Mini Poem - 47

బొమ్మలేం కాదుగానీ
అమ్మకాలు జరుగుతున్నాయి

వర్ణలేఖ - 5జున్12