మొదటి చూపుతో ఆ క్షణం
అలా స్థంభించి పోయింది నా మదిలో
తొలి చూపులో ఇంత మైమరపా
నమ్మలేదు కానీ మైమరిచా
ఇంకేమీ లేవీ లోకంలో నా చుట్టూ
జనాలు చెట్లూ రోడ్డు వాహనాలు
ఏవీ నా కంటిపాపకి అందడంలేదు
... అర్జునుడికి పిట్టకన్ను మత్రమే కనిపించినట్టు
నీ తీక్షణమైన చూపు నా వైపు
కేవలం నా కోసం ఆ చిరునవ్వు
నా కళ్ళు తనని చూడాలని
నాలోని శక్తినంతా కూడదీసుకున్నాయి
అంతా స్థబ్దమే మన కళ్ళు తప్ప
ఆ ఊహే ఓ అద్భుతం నా మనసుకి
ఆ చూపు ఆగింది నా గుండెల్లో రైళ్ళ రాకపోకలు
కళ్ళల్లో కొటి కాంతులు మనసులో వేవేల వర్ణాలు
నీ తలపులతోనే తెరలేస్తుంది చిరునవ్వు
నీ వలపులోనే మునకలేస్తుంది మనసు
రోజంతా ఆ కళ్ళ ధ్యాసే ఆ నవ్వులో
అర్ధాలు వెతకడానికి నా ఊహ చాలడం లేదు
ఏ కవి హృదయం అప్పడగను
నీ నవ్వుకి నిర్వచనాలు ఇవ్వాలని
వర్ణలేఖ - 30 April 2012
అలా స్థంభించి పోయింది నా మదిలో
తొలి చూపులో ఇంత మైమరపా
నమ్మలేదు కానీ మైమరిచా
ఇంకేమీ లేవీ లోకంలో నా చుట్టూ
జనాలు చెట్లూ రోడ్డు వాహనాలు
ఏవీ నా కంటిపాపకి అందడంలేదు
... అర్జునుడికి పిట్టకన్ను మత్రమే కనిపించినట్టు
నీ తీక్షణమైన చూపు నా వైపు
కేవలం నా కోసం ఆ చిరునవ్వు
నా కళ్ళు తనని చూడాలని
నాలోని శక్తినంతా కూడదీసుకున్నాయి
అంతా స్థబ్దమే మన కళ్ళు తప్ప
ఆ ఊహే ఓ అద్భుతం నా మనసుకి
ఆ చూపు ఆగింది నా గుండెల్లో రైళ్ళ రాకపోకలు
కళ్ళల్లో కొటి కాంతులు మనసులో వేవేల వర్ణాలు
నీ తలపులతోనే తెరలేస్తుంది చిరునవ్వు
నీ వలపులోనే మునకలేస్తుంది మనసు
రోజంతా ఆ కళ్ళ ధ్యాసే ఆ నవ్వులో
అర్ధాలు వెతకడానికి నా ఊహ చాలడం లేదు
ఏ కవి హృదయం అప్పడగను
నీ నవ్వుకి నిర్వచనాలు ఇవ్వాలని
వర్ణలేఖ - 30 April 2012
No comments:
Post a Comment