నాకు ఇష్టమైన టే కప్పు
నా చేతుల్లోనే
ఆత్మహత్యా ప్రయత్నం
తట్టుకోలేకపోతున్నా
ఎంత నిర్దయ నాది
నిన్ను దూరం చేయలనుకున్నాను?
ఎన్ని సందర్భాల్లో శక్తినిచ్చావు?
... ఎన్ని సంతోసాల్లొ సంతోసాన్నిచ్చావు?
ఎన్ని నిరాశల్లో ఊరడించావు?
ఎన్ని రాత్రులు మెలకువగా ఉంచావు?
ఇక నా అధరాల మధువును
అందిపుచ్చుకోలేవని పోతున్నావా?
నా సంతోషాల్లో పాలు
పంచుకోలేవని పోతున్నావా?
నన్ను ఇక చుంబించలేవనే
ఆవేదనతో పోతున్నావా?
ఇక నా చేతుల్లో ఇమడలేని
రూపుని సంతరించుకున్నావు
నిన్న నేను టే మనేస్తానని
తిసుకున్న నిర్ణయమేగా
ఈ దుఃస్థితికి కారణం
వర్ణలేఖ - 6.4.12
No comments:
Post a Comment