naa manasulo mata chadhavandi anandhinchandi

naa manasulo mata chadhavandi anandhinchandi
Alochana parvamlo varnalekha

Sunday, 29 April 2012

నాలో నేను నాతో నేను

ఆలోచనలని దూరం చేయాలనే తపన
యెడ తెగని ఆలోచనలు 
ముంచెత్తుతూ
నాలోని నన్ను నాకు 
ఎత్తి చూపుతున్నాయి

నీవు నటిస్తున్నావని
ఎగతాళి చేస్తున్నాయి
నేడు నేనుగా ఉండలేని నేను
రేపటి కోసం
ఆరాటపడుతూ నేనే

నేటి నుండి నన్ను నేను
విరమించుకోలేను
నా నిస్సహాయతకు
నాకే నీరసం వస్తుంది

నాది కానిదానికోసం
ఎందుకింత వ్యామోహం
ఎందుకింత నాటకీయత
రాదనీ తెలిసీ
కాదని తెలిసీ
ఏమిటీ ఎదురుచూపు

ఏదో బాధ కాల్చేస్తుంది
నీవు రావు
నాకు నీ ఆశ చావదు
శుష్కింపచేస్తోంది
నన్ను ఈ యాతన

వర్ణలేఖ - 06april2012

No comments:

Post a Comment