ఒకానొక పరిస్థితిలో
ఒకానొక పరిస్థితిలో
ఏమి అనలేని నోటిని చూసి
ఆర్ధతతో మది విలవిలలాడింది
ఎప్పటిల అదే మోస్తరు దయతో,
కాని ఈసారి మిత్రులు మిత్రరాజ్యాలు
యుద్ధానికి దిగాయి.
పూరేకుల్లాంటి కనులు
అరరే పూవుల్లేవు, అవి
రక్త కనికల్ని చెరుగుతున్నాయ్,
ఇరువైపులా యుద్ధ పతాకాల్లా
చెవులు నిక్కపోడుచుకున్నాయ్,
ముక్కుపుటాలు అదురుతున్నాయ్
మరి అంతకన్నా చేసేదిలేక,
రక్తం సల సల మసిలి సునామి
తరంగాలై ఉప్పొంగుతోంది,
కడుపులో భోగి మంటలు రేగుతున్నాయ్,
శరీరం నరనరాన్ని తంత్రుల్లా మీటుతున్నాయ్,
కాళ్ళు చేతులు పిరికివి కాని,
నాలుకను నోటికోచినట్టు తిట్టుకున్నాయ్,
ఆ మూగ నోటి ముందు
పరిస్థితులనే అస్త్రాలకు లొంగాయి
కళ్ళు మాత్రం తన కాసిని
చల్లర్చుకోలేక జలపాతాలయ్యాయి
పరిస్థితుల ముందు ఏమి చేయలేరని
చెబితే విన్నారు కాదు, అని
నా మనసు తన మనసులో నవ్వుకుంది
- వర్ణ లేఖ
No comments:
Post a Comment